విశాఖ జిల్లా గండిగుండం పంచాయతీలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ఎదుట గ్రామస్థులు ధర్నా చేశారు. ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న వారికి.. భీమునిపట్నం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి సబ్బం హరి సంఘీభావం తెలిపారు. పాలకులు దుర్మార్గులయితే పాలన సైతం దుర్మార్గంగా ఉంటుందని ఆయన చెప్పారు.
పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కలెక్టర్కు వినతిపత్రం అందజేసినా గ్రామంలోకి వచ్చి కనీసం విచారణ చేయకపోవడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులను సహించేది లేదని.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సబ్బంహరితో పాటు భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం తెదేపా మండలాధ్యక్షులు ఉన్నారు.
ఇదీ చదవండి: