ఆటోలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, అమ్మోనియా విశాఖ జిల్లా అరకులోయ సమీపంలోని జైపూర్ కూడలిలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జైపూర్ కూడలిలో ఎక్సైజ్ ఎస్సై రవి ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా నుంచి నల్లబెల్లం, అమోనియా పట్టుబడింది. తనిఖీల్లో 80 కిలోల నల్లబెల్లం, అమ్మోనియా, 40 కిలోల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పూజారికూడా గ్రామానికి చెందిన కొండబాబు, ధర్మ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఆటోను సీజ్ చేశామన్నారు.
ఇదీ చదవండి : వెంటిలేటర్‌పై ఆక్సిజన్ అందకే చనిపోతున్నారు: అఖిలప్రియ