Two Arrested in 205 Ganja Seized Case at Pendurthi : విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి నాయుడుతోట దరి రవి నగర్‌లో ఓ ఇంటి వద్ద గంజాయిని (Ganja Smuggling) నిల్వ చేసిన ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు నగర శాంతి భద్రతల విభాగం డీసీపీ ఆనంద్ రెడ్డి తెలిపారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డీసీపీ ఆనంద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన గీసింగ్ ప్రేమ్ బహుదూర్, అతని భార్య గీసింగ్ గంగమ్మ(26) పెందుర్తిలో జీవనం సాగిస్తున్నారు. వీరు అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో గంజాయి వ్యాపారం మొదలు పెట్టారు.
Cannabis in Visakhapatnam District : అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు ప్రాంతానికి చెందిన బిసాయి సహదేవ్ అలియాస్ బన్ని వీరికి గంజాయి తీసుకు వచ్చి ఇస్తుండేవాడు. ప్రేమ్ బహుదూర్ రవి నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ నుంచి తెచ్చిన ఆ గంజాయిని అద్దె ఇంట్లో నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటాడు. ఈ క్రమంలో భారీ ఎత్తున గంజాయి తీసుకు వచ్చినట్లు గురువారం పోలీసులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసుసు నిఘా ఏర్పాటు చేశారు.
320 KG Ganja Seized in Mentada విజయనగరంలో భారీగా గంజాయి స్వాధీనం..రెండు వాహనాలు సీజ్
అనంతరం కారులో నుంచి గంజాయి దించి ఇంట్లోకి తీసుకువెళ్తుండగా పోలీసులు వారిని రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకున్నారు. బిసాయి సహదేవ్, గీసింగ్ ప్రేమ్ బహుదూర్ పోలీసులు దొరకుకుడా పరారయ్యారు. గీసింగ్ గంగమ్మను, ముంచింగిపుట్టుకు చెందిన ఎం.చంద్ర బాబు(24) పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 205 కిలోల గంజాయి, కారు, ద్విచక్ర వాహనం, స్మార్ట్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నిల్వ చేసిన అద్దె ఇంటిని సీజ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో వెస్ట్ జోన్ ఏసీపీ అన్నెపు నరసింహ మూర్తి, పెందుర్తి సీఐ మరడాన శ్రీనివాస రావు, ఎస్‌ఐలు సురేశ్, రెడ్డి అసిరితాత, సిబ్బంది పాల్గొన్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం పెందుర్తి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అసాంఘిక చర్యలకు ఇళ్లను ఉపయోగిస్తే సీజ్ చేస్తాం : అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించే భవనాలు, ఇళ్లను చట్ట ప్రకారం సీజ్ చేస్తామని డీసీపీ ఆనంద్ రెడ్డి వెల్లడించారు. ఇళ్లు అద్దెకు ఇచ్చే యజమానులు అద్దెకు ఉండే వారి పూర్తి వివరాలు తీసుకోవాలని సూచించారు. వారికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను దగ్గర ఉంచుకోవాలని ఆయన తెలిపారు. ఇంట్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని డీసీపీ ఆనంద్ రెడ్డి సూచించారు.