షెడ్యూల్ తెగలోని వాల్మీకి సామాజిక వర్గాన్ని వెబ్సైట్లో తొలగించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పాడేరులో గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఎ వద్ద మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ వెబ్ సైట్లో వాల్మీకి కులాన్ని ఇటీవల తొలగించారు. ప్రజాప్రతినిధుల చొరవతో తిరిగి పునరుద్ధరించారు. అయితే దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పాడేరులో మహాధర్నా నిర్వహించారు.
అయితే మహాధర్నాకు పలు సంఘాలు పిలుపునివ్వడంతో ముందస్తుగా కొందరు గిరిజన సంఘం నాయకులను గృహానిర్బంధం ఉంచారు. అయినప్పటికీ భారీ సంఖ్యలో గిరిజనులు ఐటీడీఏ ముట్టడిలో పాల్గొన్నారు. కార్యాలయంలోనికి ఆందోళనకారులను వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోనంకి గోపాలకృష్ణ.. మహాధర్నా వద్దకు వచ్చి, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని..హామీనిచ్చారు.
ఇదీ చదవండి: దివ్యాంగురాలిపై అత్యాచారం కేసు.. వైకాపా నేత అరెస్ట్