ETV Bharat / state

సబ్సిడీ మీటర్లకు వేలల్లో విద్యుత్ బిల్లులు... లబోదిబోమంటున్న గిరిజనులు - పెద్దమొత్తంలో విద్యుత్ బిల్లులపై పాడేరు విద్యుత్ కార్యాలయంలో ఫిర్యాదు

గిరిజన ప్రాంతాల్లోని సబ్సిడీ విద్యుత్ మీటర్లకు అధిక మొత్తంలో బిల్లులు వచ్చాయి. 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందజేస్తుండగా.. పెద్ద మొత్తంలో బిల్లులు రావడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సరిచేయాలంటూ విశాఖ జిల్లా పాడేరు విద్యుత్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

paderu tribal got heavy electricity bills
అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులపై పాడేరులో గిరిజనులు ఆందోళన
author img

By

Published : Mar 12, 2021, 7:58 PM IST

విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం చింతగున్నలలో గిరిజనులకు రూ. 12 వేల నుంచి రూ. 25 వేల వరకు విద్యుత్ బిల్లులు వచ్చాయి. అధిక మొత్తంలో బిల్లులు రావడంతో.. వారంతా సమీప విద్యుత్ కార్యాలయానికి పరుగెత్తారు. ప్రభుత్వం తమకు సబ్సిడీ కల్పిస్తోందనీ.. భారీ మొత్తంలో వచ్చిన ఈ బిల్లులతో మాకు సంబంధం లేదని చెబుతున్నారు.

ఏజెన్సీ పరిధిలో 200 యూనిట్ల విద్యుత్ వాడకం వరకు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తోంది. సబ్సిడీ విద్యుత్ మీటర్​లకు ఇప్పుడు అధిక మొత్తంలో బిల్లులు వచ్చాయి. పలుచోట్ల ఈ విధంగానే రావడంతో.. గిరిజనులు పాడేరు విద్యుత్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రాలు సమర్పించారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో.. స్థానిక విద్యుత్ సిబ్బందికీ గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. వెంటనే తమ బిల్లులు సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

'ఎన్నికల్లో వైకాపా నేతల అవకతవకలకు సాక్ష్యాధారాలున్నాయి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.