ఖజానా ఉద్యోగుల సంఘం విభజన అంటూ వేర్వేరుగా సమావేశాలు పెట్టి ఉద్యోగులను అయోమయానికి గురి చేయడం సరికాదని ఆ సంఘం అధ్యక్షుడు రవి కుమార్ అన్నారు. తమ సంఘ కార్యవర్గానికి 2022 ఫిబ్రవరి వరకు పదవీ కాలం ఉందన్నారు. ఇటువంటి గందరగోళపరిచే ప్రయత్నాలను.. చీలికకు ప్రయత్నిస్తున్న సహచర ఉద్యోగులు మానుకోవాలని కోరారు. సమస్యలు ఉంటే అందరూ సమావేశమై పరిష్కరించుకోవాలన్నదే సంఘం ఉద్దేశమన్నారు.
కొంతమంది పదవులు కావాలనే కాంక్షతో.. మాతృ సంఘంగా ఉన్న ఏపీఎన్జీవోల సంఘం మద్దతు ఉందని చెప్పడం సరికాదన్నారు.
ఇదీ చదవండి: పొలం కబ్జాకు వైకాపా నేతల యత్నం...కత్తితో పొడుచుకున్న కౌలు రైతు !