విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడు మండలంలో 214, మాడుగుల మండలంలో 162, దేవరాపల్లి మండలంలో 104, చీడికాడ మండలంలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నియోజకవర్గ కొవిడ్ ప్రత్యేకాధికారి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అనిత తెలిపారు. ఈ నేపథ్యంలో మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
ఇదీ చదవండి: