- కందుకూరు బాధిత కుటుంబాలకు చంద్రబాబు భరోసా.. ఇంటి పెద్దగా ఉంటానని హామీ
CBN CONSOLED KANDUKURI VICTIMS FAMILIES : నెల్లూరు జిల్లా కందుకూరు బహిరంగ సభ తొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాల్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓదార్చారు. పార్టీ తరఫున ప్రకటించిన పరిహారం చెక్కులు అందజేశారు. పార్టీ అండగా ఉంటుందని,. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
- ఏడాది తర్వాత వచ్చే ఎన్నికలకు.. ఇప్పుడే కుర్చీ లాగేస్తున్నారు: ఎమ్మెల్యే ఆనం
MLA Anam Sensational Comments: వెంకటగిరి ఎమ్మెల్యే మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరికి కాబోయే ఎమ్మెల్యే తానేనని.. మన వాళ్ళల్లో ఒకరు చెబుతున్నారని సచివాలయ వాలంటీర్లు, వైకాపా సమన్వయ కర్తల సమావేశంలో అన్నారు. దీనిపై ఆయన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
- జనమంతా ఒక్కసారిగా రావడంతోనే కందుకూరు ఘటన: డీఐజీ త్రివిక్రమ వర్మ
DIG and SP press meet: కందుకూరు ఘటనపై గుంటూరు రెేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ స్పందించారు. ఘటకు సంబందించి పోలీసుల వైపు నుంచి ఎలాంటి తప్పు లేదన్నారు. ఇరుకు రోడ్డులో జనం ఒక్కసారిగా రావడంతో ఘటన జరిగినట్లు తెలిపారు. బైక్ ర్యాలీకి అనుమతి లేదని, అయినా బైక్ ర్యాలీ తీసినట్లు తెలిపారు. ఆ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రమాదంపై పిచ్చయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
- జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ సక్సెస్
EMERGENCY LANDING TRAIL RUN SUCCESS : బాపట్ల జిల్లా కొరిశపాడు సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రన్‌వేపై.. విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. భారత వాయుసేనకు చెందిన నాలుగు విమానాలు రన్‌వే మీదుగా ప్రయాణించి.. కాస్త ఎత్తు నుంచే టేకాఫ్ అయ్యాయి. రన్‌వే విమానాల అత్యవసర ల్యాండింగ్‌కు పూర్తి అనువుగా ఉందని.. వాయుసేన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
- నౌకను పేల్చేసిన బ్రహ్మోస్ క్షిపణి.. ఎక్స్టెండెడ్ రేంజ్ ప్రయోగం సక్సెస్
రక్షణశాఖ జరిపిన మరో కీలక ప్రయోగం విజయవంతమైంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను.. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించింది. భారత వాయుసేన, నౌకాదళం, డీఆర్డీఓ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రయోగం జరిగింది.
- మహిళపై ఎస్సై పలుమార్లు అత్యాచారం.. అసభ్యకరమైన వీడియోలు తీసి..
మహిళా రచయితపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఎస్సై. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. మరోవైపు, పరిచయం ఉన్న ఓ యువతిపై అత్యాచారం చేశాడు యువకుడు. అనంతరం ఆమె తలపై దాడి చేశాడు. దీంతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.
- చైనాలో కొవిడ్ కేసులపై అనుమానాలు.. మరోసారి ప్రపంచ దేశాలకు ముప్పు తప్పదా?
China Covid Outbreak : చైనా కరోనా విస్ఫోటనం ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కొత్త కేసులు తమ దేశంలో ఎక్కడ కల్లోల పరిస్థితులకు దారి తీస్తాయోనని ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. తమ దేశంలో కరోనా కల్లోలం లేదని చైనా చెబుతున్నప్పటికీ.. తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలోనూ డ్రాగన్ ఇవే మాటలు చెప్పిందని దేశాలన్నీ గుర్తు చేస్తున్నాయి.
- ఖైదీలకు గుడ్‌న్యూస్.. జీతాలు మూడు రెట్లు పెంపు.. నెలకు ఎంత వస్తుందో తెలుసా?
ఖైదీలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. వారికి చెల్లించే జీతాన్ని మూడు రెట్లు పెంచింది. తద్వారా భారత్‌లో ఖైదీలకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.
- సూర్యకుమార్, స్మృతి మందాన.. ఆ ఐసీసీ అవార్డుకు నామినేట్
సూర్యకుమార్ యాదవ్, స్మృతి మందాన టీ20ల్లో క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇంకా ఎవరెవరంటే?
- Avatar 2 collections: రికార్డు సృష్టించిన 'అవతార్2'.. ఆ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్
Avatar 2 Collections : హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్ 2' సినిమా. ఇటీవల విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును సృష్టించింది. ఆ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.