ఇరవై రోజులుగా విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఓ పక్క ఉక్కపోత పెరిగిపోతుంటే.. మరోపక్క పొగమంచు వ్యాపించింది. పగలంతా వేసవి తాపం చూపిన భానుడుని మేఘాలు కప్పేశాయి. సాయంకాలం వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావటంతో వేసవి కాస్త.. శీతాకాలాన్ని తలపించింది. దట్టంగా అలుముకున్న పొగమంచు... చిరుజల్లులను తలపించింది. దీంతో అక్కడికి పర్యటకులు ఆనందోత్సాహాలతో ప్రకృతిని ఆస్వాదించారు.
ఇదీ చదవండి: యారాడ తీరానికి కొట్టుకొచ్చిన డాల్ఫిన్ మృతదేహం