యువత దేశభక్తిని పెంచుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ వి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈటీవీ భారత్ ఈనాడు ఆధ్వర్యంలో దేశభక్తి యువత పాత్ర అనే అంశంపై సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈరోజు మనం స్వేచ్చాయుత వాతావరణంలో జీవిస్తున్నామంటే దానికి కారణం ఎందరో ఆమరవీరుల ప్రాణత్యాగం వల్ల అని గుర్తుంచుకోవాలన్నారు. యువత దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం.. స్వాతంత్రం సాధిస్తామన్న నినాదంతో స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:వైకాపా దాడులకు తెదేపా భయపడదు: కోటంరెడ్డి