ETV Bharat / state

విశాఖ అతిథి గృహంపై వ్యాజ్యంలో ప్రభుత్వం కౌంటరు - వైజాగ్ ల్యాండ్స్ వార్తలు

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కాపులుప్పాడ గ్రామ పరిధి సర్వే నంబర్ 386/2లోని గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి చెందిన 30 ఎకరాల్ని రాష్ట్ర అతిథి గృహ నిర్మాణ కోసం ప్రభుత్వం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.

Visakhapatnam guest house issue
విశాఖ అతిథి గృహంపై వ్యాజ్యంలో ప్రభుత్వం కౌంటరు
author img

By

Published : Jan 27, 2021, 5:13 AM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కాపులుప్పాడ గ్రామ పరిధి సర్వే నంబర్ 386/2లోని గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి చెందిన 30 ఎకరాల్ని రాష్ట్ర అతిథి గృహ నిర్మాణ కోసం ప్రభుత్వం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేసింది. అతిథి గృహం నిర్మిస్తున్న స్థలం అటవీ భూమి కాదని .. అది ప్రభుత్వ భూమి అని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కౌంటర్​లో పేర్కొన్నారు. అతిథి గృహం ప్లాన్లు, నిర్మాణ వ్యయం ఇంకా ఖరారు కాలేదన్నారు. వీవీఐపీల కోసం అతిథి గృహం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని....పిటిషనర్ చెబుతున్నట్లు ఇతర ప్రయోజనాల కోసం కాదన్నారు.

గ్రేహౌండ్స్ భూమిని అతిథి గృహం నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ముఖ్య కార్యదర్శి ఇటీవల కౌంటరు దాఖలు చేశారు. పిటిషనర్ జనసేన పార్టీ నాయకుడిని అది చెప్పకుండా పిల్ వేశారని వివరించారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వకూడదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.