ఏకధాటిగా కురిసిన వర్షాలకు పచ్చగా మారిన వనాన్ని... తెల్లటి మల్లెలు కప్పివేశాయేమో అన్నట్టుగా ఉంది. మరో వైపు కమ్మకొస్తున్న కారు మేఘాలు... చూపరులను కట్టిపడేస్తున్నాయి. విశాఖ ఏజెన్సీ పాడేరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంజంగి కొండల్లో ఈ అద్భుత సోయగం పర్యటకులను ఆకట్టుకుంటోంది.
లాక్డౌన్కు సడలింపులు ఇవ్వగా... వీక్షకులు ఈ సహజ సిద్ధ అందాలను సందర్శించేందుకు తరలి వస్తున్నారు. ఈ అద్భుత చిత్రాలను తమ చరవాణిలో బంధిస్తున్నారు. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు.
ఇదీ చదవండి: