విశాఖ జిల్లా పాయకరావుపేట మేజర్ పంచాయతీ ఉప సర్పంచి ఎన్నికపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపాకు చెందిన రెండు వర్గాల వారు ఉప సర్పంచి పదవి ఆశించి.. ఒక వర్గం వారు మరొక వర్గం వారితో వాగ్వాదానికి దిగారు. మెజార్టీ వార్డు సభ్యులు ఉన్న దగ్గుపల్లి సాయి వర్గానికి చెందిన అభ్యర్థి మోహన్‌ను కాదని... ఎన్నికల అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని వార్డు సభ్యులు ఆరోపించారు. మళ్లీ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. మెజారిటీ సభ్యులు కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. ఆర్వోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి