ETV Bharat / state

'విశాఖ ప్లాంటును విదేశాలకు అప్పగించడం దారుణం' - vizag latest news

స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా పోస్కో అంటూ కొత్త కంపెనీకి మిగిలిన భూములు కట్టబెట్టడం ఏమిటని విశాఖపట్నంలో తెలుగు యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్.కార్డులు ఉన్న నిరుద్యోగులకు తక్షణమే స్పెషల్ రిక్రూట్​మెంట్​ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

telugu yuvatha meeting in vizag
విశాఖపట్నంలో తెలుగు యువత ఆధ్వర్యంలో సమావేశం
author img

By

Published : Dec 19, 2020, 4:35 PM IST

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్​ను విదేశాలకు అప్పగించేలా మొగ్గు చూపడం దారుణమని తెలుగు యువత ఉపాధ్యక్షుడు మొల్లిపెంటి రాజు అన్నారు. విశాఖపట్నంలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్టీల్ ప్లాంట్ స్థాపనకు అవసరమైన భూములిచ్చిన నిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి... ఇప్పటికీ హామీలు నెరవేర్చకుండా, పోస్కో అంటూ కొత్త కంపెనీకి మిగిలిన భూములను కట్టబెట్టేందుకు యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్.కార్డులు ఉన్న నిరుద్యోగులకు తక్షణమే స్పెషల్ రిక్రూట్​మెంట్​ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ఎమ్మెల్యే వంశీ సభలో వైకాపా శ్రేణుల బాహాబాహీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.