తెలుగు దండు ఆధ్వర్యంలో విశాఖ మద్దిలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు. 'తెలుగు తల్లి ఊపిరి పీల్చుకో'' అంటూ నినాదించారు. మాతృభాషకు మంచి రోజులు వచ్చాయని తెలుగు దండు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు ఫణి శయన సూరి అన్నారు. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉలిపిరి కట్టె సామెతలా ఆంగ్ల మాధ్యమానికే కట్టుబడి ఉంటానని ప్రకటనలు చేయడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రేమికులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి పాజిటివ్ కేసుల్లో 12,500 మార్క్‌ను దాటేసిన విశాఖ జిల్లా