చేతకాని ప్రభుత్వం ఉండబట్టే వ్యవస్థ అంటే ఎవరికీ భయం లేకుండా పోతోందని... తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. విశాఖలో జరిగిన శిరోముండనం ఘటనపై స్పందించినట్లు.. పోలీసులు మిగతా ఘటనల్లో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎస్సీలంటే చిన్నచూపని ఆరోపించారు.
హోం మంత్రి, వైకాపా ఎస్సీ నాయకులు.. అన్యాయం జరిగిన ఎస్సీలను ఎప్పుడైనా పరామర్శించారా అని అనిత ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వంలో ఎస్సీ నాయకులకు స్వేచ్ఛ లేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదవడమే తప్ప మరేం లేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎస్సీల మీద దాడులు జరిగాయనిమాట్లాడుతున్న నేతలు.. వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు.
ఇవీ చదవండి..