సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. అరకులోయలో నిర్వహించిన శాంతా మహిదేవి జాతర మహోత్సవానికి హాజరైన ఆయన... గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ దఫా ఎన్నికల్లో తెదేపాకు నిశ్శబ్ధ ఓటింగ్ జరిగిందని చెప్పారు. ఈ నెల 23న తెదేపా ప్రభుత్వమే ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఈవీఎంల మొరాయింపు జరగటం ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
ఇవి కూడా చదవండి: