విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షమే ఉపసంహరించుకోవాలని.. లేనిపక్షంలో ఎలమంచిలిలో ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన తెదేపా నాయకులు, కార్యకర్తలతో పెద్దఎత్తున బైకు ర్యాలీ చేపట్టారు. నినాదాలు చేశారు.
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పార్టీలకతీతంగా భారీ ఎత్తున్న ఆందోళన చేస్తున్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోవడం దారణమన్నారు. ఈ ర్యాలీలో తెదేపా నాయకులు కొలకలూరి విజయబాబు, కాండ్రకోట చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: