మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి సంతాపంగా విశాఖలో ఆ పార్టీ నేతలు ఆయన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్ లోని కాళీమాత ఆలయం ఎదురుగా, ఆంధ్రయూనివర్శిటీ విద్యార్థులు ఈ శిల్పాన్ని రూపొందించారు. కోడెల ఆత్మహత్య, రాజకీయ హత్యేనని ఎమ్మెల్యే గణేష్ కుమార్ అన్నారు. ప్రభుత్వ హింసాత్మక ధోరణి వల్ల ఓ సీనియర్ నాయకుణ్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ గా కోడెల, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు.
ఇదీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల నిరసనలు