మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారం లేకపోవటంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. ఆర్టీసీ స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. దీనివల్ల ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించటంతో వ్యాపారపరంగా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గణేష్ చెప్పారు. ఈ నిర్ణయంపై తెదేపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులోనూ తెదేపాకు రాష్ట్ర ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే గణేష్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి
'50 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఆర్టీసీకి తిరిగి వస్తాయా..?'