ETV Bharat / state

Beeda Ravichandra: 'వారికి బిల్లులు ఆపడం ఎంతవరకు న్యాయం?' - తెదేపా నేత బీద రవిచంద్ర వార్తలు

గ్రామాల అభివృద్దికి పాటుపడిన వారికి బిల్లులు ఆపడం ఎంతవరకు న్యాయమని.. తెదేపా నేత బీద రవిచంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో పంచాయతీ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. మోసపూరిత ప్రచారం చేసి బిల్లులను ఆపేసిన ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఏమాత్రం దానిని రుజువు చేయలేకపోయిందని అన్నారు.

tdp leader beeda ravichandra fires on ycp over huge corruption in panchayat works
'గ్రామాల అభివృద్దికి పాటుపడిన వారికి బిల్లులు ఆపడం ఎంతవరకు న్యాయం'
author img

By

Published : Oct 31, 2021, 4:23 PM IST

రాష్ట్రంలో పంచాయతీ పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని.. మోసపూరిత ప్రచారం చేసి బిల్లులను ఆపేసిన ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఏమాత్రం దానిని రుజువు చేయలేకపోయిందని.. తెదేపా ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర(tdp leader beeda ravichandra) అన్నారు.

రాష్ట్రంలో చిన్నా చితకా పనులు చేసి గ్రామాల అభివృద్దికి పాటుపడిన వారికి.. బిల్లులను నిలిపివేయడం ఎంతమాత్రం సమంజసమన్న హైకోర్టు ప్రశ్నకు.. తమ తప్పేమీలేదని నేరుగా కేంద్ర అధికారులు ఇచ్చిన వివరణ వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

గ్రామాల అభివృద్ది కోసం అక్కడి వారే ముందుకు వచ్చి.. వివిధ పథకాల కింద పనులు చేపడితే వాటిని చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయ స్దానం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం.. స్దానిక ఎమ్మెల్యే, మంత్రుల అడుగులకు మడుగులొత్తుతూ బిల్లుల చెల్లింపును తొక్కిపెడుతోందని ఆయన మండిపడ్డారు. వారు ఆ వైఖరిని వీడాలని సూచించారు.

ఇదీ చదవండి:

Governor wishes: ప్రజల సంతోషమే.. ప్రభుత్వ విజయానికి కొలమానం: గవర్నర్​ బిశ్వభూషణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.