ETV Bharat / state

'బిల్లుల వసూళ్లకు మీరు వస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి' - ayyanna latest tweet

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్, విజయసాయిరెడ్డిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 8 రాష్ట్రాలు జగన్ ప్రభుత్వాన్ని ఏవిధంగా ఆదర్శంగా తీసుకున్నాయో చెప్పాలంటూ ట్వీట్ చేశారు.

ayyanna pathrudu
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు
author img

By

Published : Jul 16, 2020, 2:06 PM IST

విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి జగన్​రెడ్డి, సాయి రెడ్డి వెళ్తే అసలు వాస్తవాలు బయటపడతాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరలకు విద్యుత్ కొని 6 వేల కోట్లు ఆదా చేస్తే..., కేంద్ర మంత్రి ఎందుకు తప్పు పట్టారని నిలదీశారు. 2 రూపాయల 70 పైసలకే కేంద్ర ప్రభుత్వం యూనిట్ విద్యుత్ అందిస్తుంటే ఏపీలో అధిక ధరలకు కొనడమే కాకుండా ప్రజల నుంచి యూనిట్​కి 9రూపాయలు వసూలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రకటించటాన్ని అయ్యన్న గుర్తు చేశారు. విద్యుత్ కొనుగోళ్లు,అధిక బిల్లుల వసూళ్లతో 13 నెలల్లో సుమారుగా 30 వేల కోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. పీపీఏల్లో వేలు పెట్టి చివాట్లు తిన్నందుకు 8 రాష్ట్రాలు జగన్​ని ఆదర్శంగా తీసుకున్నాయా అని ఎద్దేవా చేశారు. ధరలు పెంచి ప్రజలపై భారం మోపినందుకు ఆదర్శంగా తీసుకున్నారా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి గత ప్రభుత్వం పై ఏడుపుగొట్టు వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి: ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.