చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యేలు అభివృద్ధిలో పోటీపడితే.. జగన్ ప్రభుత్వం అవినీతిలో పోటీ పడుతుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైకాపా నేతల అరాచకాలు, బెదిరింపులే కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రతి కార్యక్రమాల్లో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
స్థానిక వైకాపా నేతలే ఇసుకను బ్లాక్ చేసి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలై.. లక్షల మందికి ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం, భూపంపిణీ అన్నింటా దోపిడీకి పాల్పడుతున్నారని... ప్రశ్నిస్తే కేసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపై కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తే కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు.
ఇదీ చదవండి :