రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా.. నివారించటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో.. తెలుగదేశం పార్టీ సమరభేరీ పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారితో మృతి చెందిన వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా ప్రతినిధుల కుటుంబాలకు 50 లక్షలు ఇవ్వాలన్నారు. కరోనా మృతులకు 10 లక్షల రూపాయల చొప్పున బీమా సదుపాయం కల్పించాలని సూచించారు. మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలనీ..రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి వేలిముద్రల తో నిమిత్తం లేకుండా సరుకులు నేరుగా పంపిణీ చేయాలని కోరారు.
ఇదీ చదవండి: మాచ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి