విశాఖ జిల్లా ఆనందపురం మండలం నేళ్తేరు గ్రామానికి చెందిన పాండ్రంకి సూర్యనారాయణ (46).. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన.. బావిలో మృతదేహంగా తేలాడు. బావి గట్టు మీద.. సూసైడ్ లెటర్, షర్ట్, మొబైల్ ఫోన్, బైక్ తాళాలను పోలీసులు గుర్తించారు.
తన చావుకు బంక సూర్య నారాయణ, అల్లుడు చిన్నంనాయుడు అని మృతుడి స్వదస్తూరితో రాసినట్టుగా ఉన్న సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:
సీఎం కేసీఆర్ బంధువులు కిడ్నాప్... రాయలసీమ ముఠా పనిగా అనుమానం!