విశాఖ జిల్లా చోడవరం సహకార చక్కెర కర్మగారంలో ఎక్కువ చెరకు తూనిక కేంద్రాలున్నాయి. అవేకాకుండా కొత్తగా చెరకు తూనిక కేంద్రాలు ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు చేపడుతుందని రైతులు తెలిపారు.
బుచ్చెయ్యపేట మండలం కొమాళ్లపూడిలో చెరకు తూనిక కేంద్రం ఏర్పాటు చేశారని అన్నారు. ఇందుకు రూ.15 లక్షల వరకు వ్యయం చేశారని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన తూనిక కేంద్రం ప్రారంభానికే నోచుకోలేదని.. నిర్మించిన భవనాలు నిరూపయోగంగా మారాయని వాపోయారు. కొమాళ్లపూడి చెరకు తూనిక కేంద్రం విషయంలో కర్మగారం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెరకు రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి మొలకెత్తని వరి విత్తనాలు.. ఆందోళనలో రైతులు