Disappearance of students in sea: విశాఖ జిల్లా భీమిలి బీచ్‌లో గల్లంతైన విద్యార్థుల గాలింపునకు.. ఎలాంటి చర్యలు చేపట్టలేదని కళాశాల సిబ్బందిపై తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించడానికి వచ్చిన అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సిబ్బందిని నిలదీశారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కాలేజికి.. సిబ్బంది అనుమతించకపోవటం వల్లే.. ఈ ఘటన జరిగిందనీ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గల్లంతైన విద్యార్థుల గాలింపునకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు.
ఇది జరిగింది: భీమిలి సముద్ర తీరంలో శుక్రవారం ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. సంగివలస అనిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సవం చదువుతున్న కుడితి సాయి, యామల సూర్య అనే విద్యార్థులు.. భీమిలి బీచ్‌లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. కళాశాలకు వెళ్లిన తమ పిల్లలు.. సముద్రంలో గల్లంతయ్యారనే వార్త తెలియడంతో తల్లిదండ్రులు భీమిలి తీరానికి చేరుకుని.. కన్నీరు మున్నీరుగా విలపించారు. గల్లంతైన విద్యార్థుల బంధువులు భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థుల కోసం శుక్రవారం.. నావెల్ కోస్ట్ గార్డ్ బృందాలు, ఇండియన్ కోస్టల్ గార్డ్ హెలికాప్టర్‌తో గాలింపు చేపట్టారు. చీకటి పడి వాతావరణం అనుకూలించకపోవటంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. మెరైన్ లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు తహసీల్దార్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.
ఇవీ చదవండి: