వసతిగృహంలో విద్యార్థులు మూడురోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. ఏం చేయాలో తోచక సోమవారం రోడ్డెక్కారు. గూడెంకొత్తవీధి మండలం సప్పర్ల బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో 234 మంది విద్యార్థులున్నారు. ప్రధానోపాధ్యాయుడే ఇక్కడ వార్డెన్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిన్నారు. శనివారం ప్రధానోపాధ్యాయుడు గెన్ను ఇంటికి వెళ్లిపోయారు. గ్యాస్ లేదని వంట సిబ్బంది వండటం మానేశారు. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. ఆదివారం ఉదయం విద్యార్థులు సొంత డబ్బులతో జొన్నపిండి కొనుగోలు చేసుకుని వండుకున్నారు. ఆకలికి తట్టుకోలేక కొందరు ఇళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన వారు సోమవారం ఉదయం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. గాలికొండ ఎంపీటీసీ సభ్యుడు బుజ్జిబాబు, సర్పంచి బుజ్జిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జీవన్, సురేష్‌లు కర్రలు సేకరించి వంట చేశారు. సహాయ గిరిజన సంక్షేమాధికారి పి.వినాయకరావు ప్రధానోపాధ్యాయుడిని వెంట పెట్టుకుని అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పడానికి యత్నించారు. ఈ క్రమంలో వీరి ఆందోళన నేడూ కొనసాగుతోంది.
ఇదీచదవండి. JUSTICE PRASHANTH KUMAR MISHRA: 'న్యాయ సేవా కార్యక్రమాల ద్వారా అవగాహన'