ETV Bharat / state

'రైతులెవ్వరూ అధైర్యపడొద్దు... నష్టపోయిన వారిని ఆదుకుంటాం' - రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్​ జి. శేఖర్​బాబు

విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలంలో మొలకెత్తని వరి విత్తనాల పొలాలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. రైతులకు మొలకెత్తని విత్తనాల స్థానంలో కొత్తవి ఇవ్వనున్నట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డా.శేఖర్ బాబు తెలిపారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ వరి సాగులో భాగంగా రైతు భరోసా కేంద్రాలలో వరి విత్తనాలు కొనుగోలు చేసి పొలంలో జల్లారు. వడ్డాది, మంగళపురంలలో వరి విత్తనాలు మొలకెత్తలేదు.

State Seed Development Corporation MD visits bucchayapeta mandal in visakha district
మొలకెత్తని విత్తనాలు స్థానంలో రైతులకు కొత్తవి ఇవ్వనున్నట్లు విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డా.శేఖర్ బాబు తెలిపారు.
author img

By

Published : Jul 10, 2020, 10:47 AM IST

విత్తనాలు మొలకెత్తకపోతే రైతులెవరూ అధైర్యపడవద్దని, వారికి కొత్తవి ఇస్తామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్​ జి. శేఖర్​బాబు తెలిపారు. 'మొలకెత్తని వరి విత్తనాలు' శీర్షికన బుధవారం ఈనాడు- ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. విశాఖ జిల్లా వ్యవసాయాధికారులతో కలిసి గురువారం వడ్డాది కస్సా పొలాల్లో వరి నారుమళ్లను పరిశీలించారు. ఇప్పటికే విత్తనాలు జల్లుకుని నష్టపోయిన వారిని కూడా ఆదుకుంటామని చెప్పారు.

మొలక శాతం 50 కంటే తక్కువ ఉంటే విత్తనాలు పూర్తిగా ఇస్తామన్నారు. 50 నుంచి 80 శాతం మధ్య మొలక శాతం వచ్చిన వాటికి ఇద్దరు రైతులకు కలిపి ఒక బస్తా విత్తనాలు ఇస్తామని పేర్కొన్నారు. ఒక ఆర్​జీఎల్​ రకం విత్తనాల్లోనే కొన్ని చోట్ల ఈ సమస్య వచ్చిందన్నారు. వడ్డాదిలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులతో సమావేశం నిర్వహించారు. కియోస్క్​ యంత్రాల్లో రైతుల వివరాలను నమోదు చేసుకుంటే ఎరువులు, పురుగులు వంటి వాటిని కూడా తీసుకువచ్చి 48 గంటల్లో అందిస్తారని ఎండీ తెలిపారు. యంత్రాలను కూడా అందుబాటులో ఉంచి రైతులకు అద్దెకు ఇస్తాన్నారు. వ్యవసాయశాఖ జేడీ లీలావతి, చోడవరం ఏడీఏ శంకర్​రెడ్డి, మండల వ్యవసాయాధికారిణి రూప, ఇతర సిబ్బంది, వైకాపా నాయకుడు దొండా నారాయణమూర్తి, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

మొలకెత్తని వరి విత్తనాలు.. భరోసా కేంద్రంలో కొని మోసపోయామన్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.