విశాఖ జిల్లా పాత మల్లంపేట వద్ద ఉన్న దరమట్టంలోని శ్రీ ఉమాదార మల్లేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించిన తిరుణాళ్లకు సంబంధించి హుండీతో పాటు టిక్కెట్లు, దర్శనాలు ఇతర ఆదాయాన్ని లెక్కించారు. దేవాదాయ శాఖ జిల్లా అదనపు కమిషనర్ శాంతి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ ప్రారంభించారు. హుండీ ఆదాయం రూ.91,658, దర్శన టిక్కెట్ల ద్వారా రూ.97,420 ప్రసాదాల విక్రయాలు, పార్కింగ్ ఆదాయం రూ.75,000. మొత్తంగా రూ.2,64,078 వచ్చాయని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
వచ్చిన ఆదాయాన్ని ఆలయం వద్ద భక్తుల కోసం మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ఉపయోగిస్తామని ఆలయాధికారులు అన్నారు. దీనిపై గ్రామ పెద్దలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటాద్రి , ఆలయ కమిటీ అధికారులు, అర్చకులు, చైర్మన్ సత్యనారాయణ,మాజీ సర్పంచ్, వైఎస్సార్ యూత్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మహానందిలో కన్నులపండువగా రథోత్సవం