విశాఖ జిల్లాలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు కోవిడ్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. ఇప్పటి వరకు 5 ప్రైవేట్ ఆస్పత్రులకు కోవిడ్ ఆస్పత్రులుగా ఆదేశాలిచ్చారు.
- గాయత్రి విద్యాపరిషత్ మెడికల్ కళాశాల, ఆస్పత్రి
- ఎన్నారై ఆస్పత్రి
- ఇండస్ ఆస్పత్రి
- రాంనగర్ అపోలో ఆస్పత్రి
- హెల్త్ సిటీ ఎంబీ ఆస్పత్రి
ఈ ఐదు యాజమాన్యాలకు.. సిబ్బందితో సహా ఆస్పత్రిని సిద్దం చేయాలని జిల్లా కొవిడ్ సమన్వయ కర్త డాక్టర్ పివి సుధాకర్ కోరారు. ఇప్పటికే అందులో ఉన్న నాన్ కోవిడ్ రోగులను వేరే ఆసుపత్రులకు తరలించాలన్నారు.
ఇదీ చదవండి: