ETV Bharat / state

గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

author img

By

Published : Oct 9, 2020, 5:23 PM IST

Updated : Oct 9, 2020, 6:11 PM IST

నివాసంలో వంట సిలిండర్ మారుస్తుండగా గ్యాస్ లీకై ప్రమాదం చోటు చేసుకున్నఘటన విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో చోటు చేసుకుంది. ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని అప్పారావు నివాసంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి యజమానురాలు అప్పారావు భార్య మహేశ్వరి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.

అద్దె నివాసంలో..

ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఆదిరెడ్డి పాలెంకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అప్పారావు కుటుంబం అద్దెకు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో అప్పారావు భార్య మహేశ్వరి తమ వంటగదిలో ఇండియన్ గ్యాస్ కొత్త సిలిండరుకు కనెక్షన్ అమర్చేందుకు యత్నించారు. ఆ సమయంలో ఇండియన్ గ్యాస్ కంపెనీకి చెందిన సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడాన్ని మహేశ్వరి గుర్తించారు. ఫలితంగా పక్కనే ఉన్న హరిత హోమ్ నీడ్స్ వద్ద గల రాయపూర్ అగ్రహారానికి చెందిన అప్పారావు, గంగరాజులను సాయం కోసం పిలిచారు.

ఆదుకుందామని వస్తే..

ఆపదలో ఆదుకుందామని వచ్చిన ఆ ఇద్దరు యువకులు వచ్చి మహేశ్వరితో పాటు లీకువుతోన్న గ్యాస్​ను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సిలిండక్ నాబ్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వంట గదిలోని గౌరీ మహేశ్వరి, ఆమె కుమార్తె అమూల్య, పక్కింటిలో నివాసం ఉంటున్న నేహా సహా అప్పారావు, గంగరాజులు బయటకు వచ్చే క్రమంలో పెద్ద శబ్దంతో సిలిండర్ పేలింది.

ప్రమాద ధాటికి..

ఈ క్రమంలో సుమారు యాభై అడుగుల దూరంలో ఆరుగురు బయటికి ఎగిరిపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఇంట్లోని ఫర్నిచర్, కిటికీలు, గోడలు, ధ్వంసం అయ్యాయి. అనంతరం ప్రహరీ గోడ విరిగి పడింది. సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ దిలీప్ కుమార్ హుటాహుటిన తన సిబ్బందితో తరలివచ్చి మంటలను అదుపు చేసి, క్షతగాత్రులను 108లో మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు.

భయాందోళనలో కాలనీ వాసులు..

ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్వరి, అమూల్య, సౌమ్యలు విశాఖలో చికిత్స పొందుతున్నారు. అగ్రహారం యువకులు అప్పారావు, గంగ రాజుకు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి విశాఖ కేజీహెచ్​ తరలించారు.

ఇవీ చూడండి : నో మాస్క్​ నో సర్వీస్... అన్​లాక్​ 5 మార్గదర్శకాలు జారీ

Last Updated : Oct 9, 2020, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.