విశాఖ సింహాచల దేవస్థాన కాటేజీలో ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా నాలుగు నెలలుగా ఉంటున్న ఛైర్మన్ సంచయిత వ్యక్తిగత సహాయకుడు సౌందర్యరాజన్ను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఛైర్మన్, ఈవోలు ఇద్దరూ ఖాళీ చేయాలని ఉత్తర్వులిచ్చినట్లు దేవస్థాన సిబ్బంది వెల్లడించారు. దీనిపై కమిషనర్ కార్యాలయానికి సమాచారమిచ్చినట్లు సిబ్బంది చెప్పారు. అనధికారికంగా దేవస్థాన కాటేజీలో ఎందుకు ఉంటున్నారని సౌందర్యరాజన్ను ప్రశ్నిస్తే....ఆ విషయం దేవస్థాన అధికారులను అడగాలని ఆయన బదులిచ్చారు.
ఇదీ చదవండి: సింహగిరిపై మరో కొత్త వివాదం... !