ETV Bharat / state

ఏపీ నుంచి ముంబయికి గంజాయి తరలింపు.. పట్టుకున్న తెలంగాణ పోలీసులు - Sangareddy crime news

విశాఖ మన్యం నుంచి ముంబయికి తరలిస్తున్న రూ. 44 లక్షలు విలువ చేసే ఎండు గంజాయిని తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హాద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. 106 ప్యాకెట్లలో తరలిస్తున్న 436 కేజీల రెండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ganjayi seized
ఏపీ నుంచి ముంబయికి గంజాయి తరలింపు
author img

By

Published : Dec 3, 2020, 8:35 PM IST

విశాఖ మన్యం నుంచి ముంబయికి తరలిస్తున్న రూ. 44 లక్షలు విలువ చేసే ఎండు గంజాయిని తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హాద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. నాల్కల్ మండలం శంషెల్లాపూర్ శివారు జహీరాబాద్-బీదర్ మార్గంలో దీన్ని స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని ముంబయికి పొక్లెయిన్ తరలించే ట్రాలీ లారీ అడుగుభాగంలో ప్రత్యేక పెట్టెలు అమర్చి.. 106 ప్యాకెట్లలో తరలిస్తున్న 436 కేజీల రెండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన లారీ సహా గంజాయి ప్యాకెట్​లను జహీరాబాద్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న విశాఖపట్నం జిల్లా గొలుగొండ ప్రాంతానికి చెందిన కర్రే కృష్ణ, బొబ్బిలి వెంకయ్య నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్న హద్నూర్ సీఐ కృష్ణ కిషోర్, ఎస్ఐ విజయ్ రావులను డీఎస్పీ శంకర్ రాజు అభినందించారు.

ఇదీ చూడండి:

తెదేపా ఎమ్మెల్సీ అర్జునుడు ఆరోగ్యం ఆందోళనకరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.