ఎలమంచిలిలో సంక్రాంతి మేలుకొలుపులను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పండగకు ముందు ఈ కార్యక్రమం జరిపించటం ఆనవాయితీ. పట్టణంలోని తులసీనగర్ బృందం మహిళలు కన్నుల పండువగా మేలుకొలుపు జరిపించారు. సీతారాముల చిత్రపటాన్ని పట్టుకొని వేకువజామున ఇంటింటికి వెళ్లి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
గ్రామీణ ప్రాంతాల్లో చేసే మేలుకొలుపును ఎలమంచిలిలో నిర్వహించడం ప్రత్యేకత సంతరించుకుంది. రామాలయంలో మొదలు పెట్టి..పురవీధుల్లో తిరిగిన అనంతరం మళ్లీ ఆలయంలో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని.. భక్తి పాటలు పాడారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తజనం