సంక్రాంతి పండగంటే ముందుగా గుర్తుచ్చేది... చక్కటి ముగ్గులు.. వాటి మధ్యలో గొబ్బెమ్మలు... పిండివంటలు, కొత్తబట్టలు... చుట్టాలు... కోళ్లపందాలు, గాలిపటాలు, గంగిరెద్దులు, హరిదాసులు... ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఇంకా పండుగకు మూడురోజుల సమయమే ఉంది. ఈ సంప్రదాయాల విలువ ఐఐఎంలో చదువుతున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తెలిసేలా...సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు.
కళాశాల ఆవరణలో పల్లె వాతవరణాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు రంగుల ముగ్గులు పెట్టి, భోగిమంటలు వేసి హరిదాసులను కొలిచి సందడి చేసారు. పల్లెకు వెళ్లకుండానే పట్టణమే పల్లెలా మార్చామని విద్యార్థులు ఆనందపడుతున్నారు. కనుమరగవుతున్న సంస్కృతిని కాపాడుకోవచ్చంటున్నారు. విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశేషాలను నేరుగా తెలియజేయడం కోసం సంక్రాంతి సంబరాలు కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసినట్టు నిర్వహకులు చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యం మెరుగవుతుందంటున్నారు. పిండివంటల పోటీలు, ఉత్తమ సంప్రదాయ వస్త్రాలు కట్టుకున్న విద్యార్థులను అభినందించే కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు గంగిరెద్దులు, హరిదాసులతో సెల్ఫీలు తీసుకుని మధురక్షణాలను పదిలంగా భద్రపరచుకున్నారు.
ఇవీ చదవండి
శిల్పారామంలో ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు