ETV Bharat / state

కరోనాతో ఆదాయం తగ్గినా... కార్గో సేవలతో నష్టం భర్తీ - కరోనాతో ఆదాయం తగ్గినా...కార్గో సేవలతో నష్టం భర్తీ !

కరోనా లాక్ డౌన్​తో ప్రయాణాలు లేక ఆర్టీసీకి వచ్చే ఆదాయం బాగా తగ్గింది. అలాంటి సమయంలో ఆర్టీసీ అధికారులు మొదలు పెట్టిన ఏపీఎస్ఆర్టీసీ పార్సిల్ సర్వీస్​కు మంచి స్పందన వస్తోంది. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా తక్కువ సమయంలో వస్తువులు చేరవేస్తూ ప్రజా మన్ననలు పొందుతోంది. ఒక్క విశాఖ ఏటా 75 కోట్లు ఆదాయం లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.

కరోనాతో ఆదాయం  తగ్గినా...కార్గో సేవలతో నష్టం భర్తీ !

author img

By

Published : Jul 5, 2020, 7:17 PM IST

కరోనా కారణంగా ప్రయాణాలు లేకపోవటంతో కార్గో సేవలను ఆర్టీసీ మరింత విస్తృతం చేసింది. ప్రయాణికులను తీసుకువెళ్లే బస్సులను కొద్దీ మార్పులు చేసి కార్గో సర్వీసులుగా మార్చారు. విశాఖలో మద్దిలపాలెం, వాల్తేరు, కుర్మన్నపాలెం డిపోలో ప్రయాణికులను పార్సిల్ తీసుకునే వెళ్లే వాహనాలను చేశారు. ఫలితంగా వినియోగదారులు తమ వస్తువులను, ఇతర సామగ్రిని బస్సుల ద్వారా రాష్ట్రంలో ఇతర డిపోలకు తరలిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన రైతులు, వ్యాపారులు ఈ సేవల ద్వారా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధర ప్రకారం చూసుకున్నా... ప్రైవేట్ కొరియర్లకంటే తక్కువ ధరకి తక్కువ సమయంలో వస్తువులు గమ్య స్థానాలకు చేరుకుంటున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి నాలుగు జిల్లాలో బస్సులు తిరుగుతున్నాయి. ప్రతి డిపో నుంచి పది లక్షల వరకు ఈ పార్సిల్ సరకు రవాణాపై సాధించే లక్ష్యంగా అధికారులు ప్రణాళిక వేశారు. ఇప్పటికే ప్రతి డిపోలో కౌంటర్ పెట్టి చిన్న లెటర్ నుంచి పెద్ద పార్సెల్ వరకు రవాణా చేస్తూ వేగవంతమైన సురక్షిత వంతమైన సేవలను అందిస్తోంది.

ఆర్టీసీ సరకు రవాణాకు మంచి స్పందన ఉందని అధికారులు అంటున్నారు. డిమాండ్​కు తగినట్టుగా కార్గో బస్సులు సంఖ్య పెంచి సేవలు మరింత పెంచుతామని చెబుతున్నారు. ఒక్క జూన్​లో విశాఖ రీజియన్ అరకోటి విలువైన సరకు రవాణా ఆదాయాన్ని సాధించిందని వెల్లడించారు. ఆర్టీసీ పార్సిల్​కి ట్రాకింగ్ సౌకర్యం కల్పించి వస్తువు భద్రత వివరాలు మొబైల్​లో వినియోగదారుడికి అందజేస్తున్నామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.