విశాఖ ఏజెన్సీ పాడేరు నియోజకవర్గం జల జీవన్ మిషన్ పథకంలో రూ.49.68 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ఈ విషయాన్ని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. వీటితో నియోజకవర్గంలోని ఇంటింటికి మంచి నీటి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందుతుందని ఆమె తెలిపారు. మొత్తం 980 పనులకు రూ. 49.68 కోట్లు మంజూరు కాగా మండలాల వారీగా కేటాయించిన నిధులు ఈవిధంగా ఉన్నాయి.
పాడేరు మండలం 119 పనులకు 3.13 కోట్లు,
చింతపల్లి మండలం 75 పనులు 3.66 కోట్లు
జి మాడుగుల మండలం 305 పనులు 8.75 కోట్లు
జీకే వీధి మండలం 122 పనులు 5.18 కోట్లు
ఇక ఐదు మండలాల్లో 5 లక్షల లోపు 236 తాగునీటి పథకాలకు 2.5, 2.6 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించామని.. ఈ పథకం ద్వారా అన్ని గ్రామాలకు మంచినీటి సదుపాయం కల్పించే ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: కుక్క కాటుకు 9 గొర్రెలు మృతి, మేకలకు గాయాలు