విశాఖలో రౌడీషీటర్ వెంకటరెడ్డి అలియాస్ బండరెడ్డి హత్యతో నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న అతనిపై.. ఎమ్వీపీ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొంతమంది యువకులను తనతో తిప్పుకుని.. వారిని తిడుతూ, కొడుతూ ఆదిపత్యం ప్రదర్శించేవాడని వెల్లడించారు. అనుచరులు బండరెడ్డితో కొన్నిసార్లు గొడవలకు దిగిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. అతనిపై కక్ష పెంచుకుని.. చంపేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటరెడ్డి.. ఇంట్లో పిల్లలతో చరవాణిలో ఆటలాడుతున్న సమయంలో బయటకు పిలిచి ఈ హత్య చేసినట్లు పోలీసులు వివరించారు. అనిల్, రింగ్ దుర్గ, గుడ్డు దుర్గా, ఆటో శంకర్.. ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సంబంధిత కథనం: