ETV Bharat / state

'పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాజ్యంగ విరుద్ధం' - Citizenship Law Amendment Bill latest news in telugu

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు 2019 రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం, ప్రజా, హక్కుల సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ బిల్లుపై వ్యతిరేకతను వ్యక్తపరిచారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/11-December-2019/5341694_455_5341694_1576072859493.png
rights groups voice against citizenship law amendment bill in visakhapatnam
author img

By

Published : Dec 11, 2019, 11:35 PM IST

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు 2019 కు వ్యతిరేకంగా వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్​క్లబ్​లో ముస్లిం, ప్రజా, హక్కుల సంఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ బిల్లు చట్టమైతే దేశంలోని ముస్లింల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని వక్తలు తెలిపారు. అవసరమైతే దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయ పోరాటానికి సిద్ధపడతామని ముస్లిం న్యాయవాదులు స్పష్టం చేశారు. దేశ సంపద, స్వాతంత్రోద్యమంలోనూ ప్రముఖ పాత్ర వహించిన భారతీయ ముస్లిం సమాజాన్ని వేరుపరిచే ఈ బిల్లు.. రాజ్యాంగ మూల సూత్రాలకు, సమానత్వ హక్కుకు వ్యతిరేకమని హక్కుల సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ఈ బిల్లుపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తోందన్నారు. అనేక అంతర్జాతీయ ఒప్పందాలకు ఈ బిల్లు విరుద్ధమని అభివర్ణించారు.

విశాఖలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సమావేశం

ఇదీ చూడండి: 'పౌర' బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు

Intro:కిట్ నం879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_11_rights_groups_voice_against_CAB_abb_AP10148

( ) పౌరసత్వ చట్ట సవరణ బిల్లు 2019 రాజ్యాంగ విరుద్ధమని, దేశ లౌకిక మూలాలకు విఘాతం అని ముస్లిం, ప్రజా, హక్కుల సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.విశాఖ వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్ క్లబ్లో ముస్లిం, న్యాయవాద, ప్రజా సంఘాల ప్రతినిధులు మీడియా సమావేశంలో ఈ బిల్లుపై వ్యతిరేకతను వ్యక్తపరిచారు.

Body:ఈ బిల్లు చట్టమైతే దేశంలోని ముస్లింల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, దేశ సంపద సృష్టిలోను, స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన భారతీయ ముస్లిం సమాజాన్ని వేరు పరిచే ఈ బిల్లు రాజ్యాంగ మూల సూత్రాలకు, సమానత్వ హక్కుకు వ్యతిరేకమని హక్కుల సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.

Conclusion:ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ఈ బిల్లుపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తోందని, ఈ బిల్లు చట్టమైతే దేశ అత్యున్నత న్యాయస్థానం లో న్యాయ పోరాటానికి సిద్ధపడతామని ముస్లిం న్యాయవాదుల న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ బిల్లు అనేక అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘాలతో పాటు మానవ హక్కుల వేదిక,పౌర హక్కుల సంఘం, మహిళా చేతన, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

బైట్స్1:కె.పద్మ,మహిళా చేతన‌,వ్యవస్ధాపక అధ్యక్షురాలు.
2:ఐ.ఎం.అహ్మద్, న్యాయ వాది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.