విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం రేఖవానిపాలెంలో మరుగుదొడ్లు, మరమ్మతుల నిర్మాణంలో... అవకతవకలు జరిగాయని యువకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ గ్రామం అవార్డు పొందినప్పటికీ వాస్తవంగా... మరుగుదొడ్ల నిర్మాణాలు జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసిన యువకుల కుటుంబాలపై భౌతిక దాడులు జరగడం, అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యను పరిష్కరించాలని... డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి వనతి పత్రం అందజేశారు. పంచాయితీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి... దోషులను శిక్షించాలని కోరారు.
ఇదీ చదవండి :