ప్రాంతీయ అటవీశాఖ క్రీడాపోటీలు విశాఖలో ప్రారంభమయ్యాయి. రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను ప్రాంతీయ అటవీ సంరక్షణ ముఖ్య అధికారి రాహుల్ పాండే ప్రారంభించారు. అటవీ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషులు, మహిళల విభాగాలలో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారు భువనేశ్వర్లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికవుతారని రాహుల్ పాండే తెలిపారు.
ఇదీ చదవండి: