విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరు మండలంలో ఖాళీగా ఉన్న పదమూడు వాలంటీర్ల పోస్టుల భర్తీకి అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మండలాభివృద్ధి అధికారి ఎం. నరసింహారావు ఖాళీల వివరాలు ప్రకటించారు.
ఖాళీలు: డోకులూరు - 1; గొండెలి, కించురు - 3; గుత్తులపుట్టు, ముంచింగిపుట్టు - 2; కాడెలి, వంజంగి - 2; మినుములూరు, వణుగుపల్లి - 2; పాడేరు - 1; సలుగు - 1; వంట్లమామిడి -1; మొత్తం ఖాళీలు: 13
అర్హత: 1) పదో తరగతి ఆ పైన
2) వయస్సు 18-35
http:/gswsvolunteer.apcfss.in వెబ్ సైట్లో ఈనెల 15 లోగా దరఖాస్తులు స్వీకరించబడతాయని చెప్పారు. 17వ తేదీ ముఖాముఖి చేసి.. తుది నియామకం చేపడతామని చెప్పారు.
ఇదీ చదవండి: