విశాఖలో పదేళ్ల బాలికపై రాజేశ్ అనే యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఈ నెల 27న విశాఖలోని ఓ కాలనీలో సైకిల్ నేర్చుకుంటున్న బాలికను కారులోకి తీసుకువెళ్లి రాజేశ్ బలాత్కారం చేశాడు. బాలికపై అత్యాచారయత్నం చేస్తున్న సమయంలో దగ్గరలో ఉన్న పిల్లలు అరవటంతో.. .రాజేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. కారులో బాలిక కాళ్లు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి ఉండడాన్ని చూసిన పిల్లలు వాటిని తొలగించి బాధితురాలిని ఇంటికి చేర్చారు. రోజు కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులు అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చాక బాలిక ద్వారా జరిగిన ఘోరాన్ని తెలుసుకున్నారు. మహిళా చేతన సంస్థ సహకారంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం గాలిస్తోంది. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. అదే కాలనీలో తుక్కు దుకాణంలో రాజేశ్ పని చేస్తున్నాడు.
సొంత సోదరిపైనా.....
బాలిక తల్లిదండ్రులను నిందితుడి సోదరి కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. తనపైనా గతంలో అత్యాచారయత్నం చేసినట్లు పోలీసుల వద్ద ఆమె వెల్లడించింది.