విశాఖ జిల్లా దేవరాపల్లిలోని రైవాడ జలాశయం నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి దాదాపుగా 1300 క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 114 మీటర్లు కాగా... ప్రస్తుతం 113.27 మీటర్లకు చేరుకుంది. జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నీటిమట్టం 113.50 మీటర్లకు చేరితే... దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులు కోరారు.
ఇదీ చదవండి
'శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే హక్కు సీఎం జగన్కు లేదు'