పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని.. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఉత్తర తమిళనాడు తీరం నుంచి దక్షిణ ఒడిశా వరకు ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది.
ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో ఒకట్రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. రాయలసీమలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది.
ఇదీ చదవండి: