ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో గల ఓనకడిల్లి, మాచ్ ఖండ్ తదితర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ గాలులతో ఉరుములు, మెరుపులుతో వడగళ్ల వర్షం పడింది. వడగళ్ల వర్షం కారణముగా జీడీ మామిడి పువ్వు దెబ్బతింది.
భారీ వర్షాలు కారణంగా మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్తు ఉత్పాదన దాదాపు మూడు గంటలు నిలిచిపోయింది. గురువారం నుంచి ఓనకడిల్లి, మాచ్ ఖండ్, జోలాపుట్, పాడువ, లమతపుట్, నందపూర్ గ్రామాల్లో సెల్ సంకేతాలు కూడా నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: