విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం అందించే మాస్కులు నాణ్యత లేవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్లు చిరిగిపోయినవి ఇస్తున్నారని వాపోయారు. ఒక్కొక్కరికీ మూడు మాస్కులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఒక్కొక్కటి మాత్రమే ఇస్తున్నారని అంటున్నారు.
చిన్న పిల్లలకు పూర్తిగా మాస్కులు ఇవ్వలేదని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి నాణ్యమైన మాస్కులను అందించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే మాస్కులు పూర్తిస్థాయిలో వస్తే అందరికీ అందిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి..