లాక్డౌన్ కారణంగా... నిత్యావసర సరుకులకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే బయట తిరిగేందుకు అనుమతిస్తున్న పోలీసులు 9 దాటాక అనవసరంగా బయట తిరుగుతున్న వాహన చోదకులను దండిస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలిలో రోడ్లపైకి వచ్చిన వారితో గుంజీలు తీయిస్తున్నారు.
భీమిలి మండల పరిధిలో నిత్యావసర సరుకులు ఆరోగ్య సంబంధ అత్యవసర పనులతో తప్ప మరే ఇతర కారణాల వల్ల అయినా బయట తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో భాగంగా తగరపువలస ప్రాంతంలో ఉదయం తొమ్మిది దాటిన తర్వాత ఆకతాయిగా తిరుగుతూ ఉన్న సుమారు వంద మంది ద్విచక్ర వాహనదారులను పట్టుకొని వాహనాలను సీజ్ చేశారు. వాహన చోదకులతో గుంజీలు తీయించారు. నిబంధనలు పాటించకపోతే శిక్షలు కఠినతరం చేస్తామని భీమిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు హెచ్చరించారు.
ఇదీ చూడండి: