విశాఖ జిల్లా పెందుర్తి 94వ వార్డులో ఇళ్ల గోడలకు అంటించిన తెదేపా కరపత్రాలను, జెండాలను జీవీఎంసీ సిబ్బంది తొలగించారు. దీనిపై ఆ ప్రాంత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇళ్లపై కట్టిన జెండాలను అనుమతి లేకుండా తొలగించారన్నారు. వాటిని తొలగించేప్పుడు తమపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.
కరపత్రాలు, పార్టీ జెండాల తొలగింపుపై జీవీఎంసీ సిబ్బందిని ప్రశ్నించగా.. అన్నీ పార్టీలకు సంబంధించిన వాటిని తీసివేస్తున్నామని సమాధానం చెప్పారని స్థానికులు తెలిపారు. ఇదంతా విజయసాయిరెడ్డి పర్యటన కారణంగానే జరిగిందని.. తెదేపా కార్యకర్తలను భయపెట్టటానికే ఇలా చేస్తున్నారని మహిళలు చెబుతున్నారు. జీవీఎంసీ సిబ్బంది తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: విశాఖలో ఎమ్మెల్యే గణబాబు ప్రచారం...